News May 3, 2024
అమేథీలో 26ఏళ్ల తర్వాత తొలిసారిగా – 1/2

అమేథీ ఎంపీ సీటు అభ్యర్థిగా కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 26ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీయేతర వ్యక్తి బరిలో నిలిచారు. చివరగా 1998లో సతీశ్ శర్మ ఇక్కడ పోటీ చేశారు. 1980లో తొలిసారిగా సంజయ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో 1981 బైపోల్స్‌లో సోదరుడు రాజీవ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. 1991లో రాజీవ్ మరణం తర్వాత ఆ సీటు సతీశ్ శర్మకు వెళ్లింది. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 21, 2026
కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.
News January 21, 2026
జగన్ పాదయాత్ర కామెంట్లపై పార్థసారథి కౌంటర్

AP: పాదయాత్ర చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ ఒకసారి పాదయాత్ర చేస్తే ఏపీ ఎంతో నష్టపోయింది. మరోసారి చేయడం వలన రాష్ట్రం ఏమైపోతుందో. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు.. మళ్లీ మళ్లీ మోసం చేయడం అసాధ్యం’ అని ఆయన విమర్శించారు. కాగా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని <<18916311>>జగన్<<>> ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 21, 2026
లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

టర్మ్ ఇన్సూరెన్స్ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.


