News January 30, 2025
దేశంలోనే తొలిసారి.. లోకేశ్కు అభినందనలు: CM

AP: రాష్ట్ర ప్రజలకు ‘మన మిత్ర’ పథకాన్ని అంకితం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘161 సేవలు అందజేసే ‘మన మిత్ర’ ప్రక్రియ ఓ మైలురాయి. మంత్రి లోకేశ్ మంచి ఆలోచనతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చాం. లోకేశ్, మెటా భారత ఉపాధ్యక్షుడు సంధ్యా దేవనాథన్కు అభినందనలు’ అని CM తెలిపారు. ఇవాళ మంత్రి లోకేశ్ ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
జగిత్యాల జిల్లాలో తొలి రోజు 48 సర్పంచ్ నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో మొదటి విడత 122 గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 48, వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు. బీమారం సర్పంచ్ 10, వార్డు మెంబర్ 11, కథలాపూర్ S.13, W 9, మల్లాపూర్ S.6 W.1, కోరుట్ల S.6, W.5, మెట్పల్లి S.8, W.5, ఇబ్రహీంపట్నం S.5, W.2 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.
News November 27, 2025
BC విద్యార్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్: సవిత

AP: BC విద్యార్థులకు DEC 14నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ‘వంద మందికి శిక్షణిచ్చేలా BC భవన్లో ఏర్పాట్లు చేస్తున్నాం. వైట్ రేషన్ కార్డున్నవారు అర్హులు. DEC 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 7న అర్హత పరీక్ష, 11న ఫలితాలు వెల్లడిస్తారు. 100 సీట్లలో BCలకు 66, SCలకు 20, STలకు 14 సీట్లు కేటాయిస్తున్నాం. మహిళలకు 34% రిజర్వేషన్లు అమలుచేస్తాం’ అని తెలిపారు.


