News March 25, 2024
గోవాలో తొలిసారి మహిళకు బీజేపీ ఎంపీ టికెట్

గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో(49)ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్.. గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది.
Similar News
News March 30, 2026
ఏప్రిల్ 20 నుంచి 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవు: DGCA

విమానాల్లో ఇకపై 60% సీట్లకు అదనపు ఛార్జీలు ఉండవని డీజీసీఏ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీనిపై విమానయాన సంస్థలు పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఈ ఫ్రీ సీట్ కోటా 20%కు పరిమితమైంది. మిగతా సీట్లకు టికెట్‌కు అదనంగా ₹200 నుంచి ₹2100 వరకు సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. తాజా ఆదేశాలతో ఛార్జ్ లేకుండా సీట్ ఎంచుకునే వెసులుబాటు పెరుగుతుంది.
News March 30, 2026
మార్చి 30: చరిత్రలో ఈరోజు

* 1908: తొలి తరం భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి మహిళ దేవికారాణి జననం (ఫొటోలో)
* 1935: తెలుగు రచయిత తంగిరాల వెంకట సుబ్బారావు జననం
* 1948: ప్రతినాయకుడు కన్నడ ప్రభాకర్ జననం
* 1971: తొలి తెలుగు సినిమా హీరోయిన్ సురభి కమలాబాయి మరణం
* 2011: సినీ నటుడు నూతన్ ప్రసాద్ మరణం
* ప్రపంచ ఇడ్లీ దినోత్సవం
News March 30, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


