News February 28, 2025

మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. SLBC ప్రమాదంతో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలోని ఎస్టీ బాలురు హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం దారుణమన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.

Similar News

News February 28, 2025

రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

image

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్‌కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.

News February 28, 2025

కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడం: రేవంత్ రెడ్డి

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వల్లే మెట్రో, మూసీ ప్రాజెక్టులు ఆగిపోయాయని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. అధికారం కోల్పోతారనే కులగణనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదన్నారు.

News February 28, 2025

APలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: సీఎం రేవంత్ రెడ్డి

image

TG: BJP, NDA పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని CM రేవంత్ వెల్లడించారు. ‘APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? APలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని CM ప్రశ్నించారు.

error: Content is protected !!