News February 22, 2025
ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా: మంత్రి అచ్చెన్న

AP: మత్స్యకారులకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్‌లో ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20వేలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పీఎం కిసాన్‌కు తోడు అన్నదాత సుఖీభవ (రూ.20వేలు) తోడ్పాటు అందిస్తామని వివరించారు. రాష్ట్రానికి 24% ఆదాయం వ్యవసాయం నుంచే వస్తోందని, జగన్ ఆ రంగానికి నష్టం చేకూర్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 50ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.
Similar News
News February 22, 2025
అభిమానులకు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చిన నటుడు

తెలుగు చిత్ర పరిశ్రమలోని విలక్షణ నటుల్లో ఒకరైన జగపతి బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటారు. తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ ‘నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి చూద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇది పాఠశాల విద్యాభ్యాసం సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఏదో టూర్‌కు వెళ్లిన ఫొటోలా కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఫొటోలో జగపతి బాబు ఎక్కడున్నారో కామెంట్ చేయండి.
News February 22, 2025
ఇండియాకు SAMSUNG మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్?

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ‘SAMSUNG’ చైనాలోని తన మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఇండియాకు మార్చనున్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్‌లతో ఇబ్బందులు ఎదురవడంతో శామ్‌సంగ్ తన స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తిని చైనా నుంచి ఇండియా/వియత్నాంకు తరలించాలని చూస్తోందని చెప్పారు. వియత్నాం కూడా US టారిఫ్‌ల ప్రమాదాన్ని ఎదుర్కోనుండటంతో INDకు మార్చడం బెటర్ అని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
News February 22, 2025
దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్

TG: దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని CM రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాహుల్ హామీ మేరకే కులగణన చేపట్టాం. BCల సంఖ్యపై గతంలో KCR కాకి లెక్కలు చెప్పారు. కానీ మేం అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించాం. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.