News October 23, 2025
బంగ్లా అదుపులో మత్స్యకారులు.. వెనక్కి తీసుకొస్తామన్న మంత్రి

AP: బంగ్లాదేశ్ నేవీ <<18075524>>అదుపులో<<>> ఉన్న 8 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
Similar News
News October 23, 2025
ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
News October 23, 2025
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.
News October 23, 2025
ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్…రయ్…

AP: రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు AP మీదుగా వెళ్లనున్నాయి. HYD-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 263 KM మేర వెళ్లనుంది. HYD-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి జిల్లాల్లో 504 KM మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 స్టేషన్లు ఏర్పాటుకానుండడంతో జర్నీటైమ్ తగ్గనుంది.