News October 6, 2024

రూ.20,000 సాయం కోసం మత్స్యకారుల ఎదురుచూపులు

image

AP: ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం కొనసాగుతుంది. ఈ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన జీవన భృతి ఇప్పటికీ అందలేదు. త్వరగా చెల్లించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతుండగా, సంక్రాంతికి ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10వేల చొప్పున లక్ష మందికి చెల్లించేది. రూ.20వేలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

Similar News

News March 18, 2026

అరకు: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

image

అరకులోయలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఐటీఐ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పై సుమారు 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రైన్ ఢీకొట్టడం వల్ల చనిపోయినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 18, 2026

మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

image

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.

News March 18, 2026

లెక్క లెక్కే.. బుమ్రాకు న్యాయం చేసేలా BCCI ప్లాన్స్

image

కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ₹7 కోట్లు అందుకునేవారు. రోహిత్, కోహ్లీ ఒకే ఫార్మాట్ ఆడుతుండటం, జడేజా T20Iల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బుమ్రా ఒక్కరే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. దీంతో A+ కేటగిరీని తొలగించి అందరినీ A గ్రేడ్‌కు మార్చడంతో ఆయనకు ₹2 కోట్ల నష్టం జరుగుతోంది. దీన్ని భర్తీ చేసేందుకు BCCI కాంట్రాక్ట్ రివైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్షర్, సిరాజ్‌ల కాంట్రాక్టూ మారొచ్చు.