News August 14, 2024
శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేట నిషేధం

AP: శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి కాలమని, ఆ సమయంలో జలాశయం బ్యాక్ వాటర్స్లో వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా రెండు రోజుల క్రితం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో మత్స్యకారులు చేపలు వేటకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News November 28, 2025
‘ఫ్రైస్వాల్’ ప్రత్యేకత.. ఒక ఈతలో 4వేల లీటర్ల పాలు

హోలిస్టిన్ ఫ్రీజియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన హైబ్రీడ్ ఆవు ‘ఫ్రైస్వాల్’. ఇది ఒక ఈత కాలంలో 4 వేల లీటర్ల పాలను ఇస్తుంది. దీనిలో అధిక పాలిచ్చే హెచ్.ఎఫ్. ఆవు గుణాలు 62.5%, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే సాహివాల్ ఆవు గుణాలు 37.5%గా ఉంటాయి. ఈనిన తర్వాత 300 రోజుల పాటు 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ICAR ప్రకటించింది.
News November 28, 2025
వైకుంఠద్వార దర్శనాలు.. తొలి రోజే 4.60L మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఆన్లైన్లో పేర్ల నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాల కోసం నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రానికే 4.60L మంది నమోదుచేసుకున్నారు. DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: టికెట్లు ఇలా బుక్ చేయండి

TTD అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మొదటి 3 రోజులకు (DEC 31, 31, JAN 1) టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 9552300009కి HI లేదా GOVINDA అని మెసేజ్ చేసి, వివరాలు ఇవ్వడం ద్వారా కూడా టికెట్లు బుక్ అవుతాయి. ఒక నంబర్తో గరిష్ఠంగా నలుగురికి బుక్ చేసుకోవచ్చు. DEC 1 వరకు ఛాన్సుంది. ఆ తర్వాత టికెట్లను లక్కీ డిప్ తీస్తారు. ఎంపికైన వారికి మొదటి 3 రోజుల్లో ఉచిత దర్శన భాగ్యం దక్కుతుంది.


