News August 12, 2024
స్కూలు బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయాలి: సీఎం

AP: స్కూళ్లకు విద్యార్థులను తరలించే అన్ని వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లాలో స్కూలు వ్యాను బోల్తా పడి భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అన్ని బస్సుల ఫిట్నెస్పై అధికారులు స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలి. ఫిట్నెస్ లేని బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి’ అని CM స్పష్టం చేశారు.
Similar News
News November 14, 2025
రాహుల్, కేటీఆర్ ఐరన్ లెగ్స్: బండి

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.
News November 14, 2025
స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.


