News August 8, 2025

ఐదుగురు BRS ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: రామ్‌చందర్ రావు

image

TG: బీఆర్ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారెవరో, ఎప్పుడు చేరతారో త్వరలో చెబుతానన్నారు. వీళ్లే కాకుండా మరింత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అటు ఇప్పటికే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈనెల 10న కాషాయ కండువా కప్పుకుంటారని రామ్‌చందర్ వెల్లడించారు.

Similar News

News August 8, 2025

రానున్న 2గంటల్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో వర్షం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చార్మినార్, మలక్ పేట్, మెహదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు తదితర జిల్లాల్లోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News August 8, 2025

హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు ప్రమోషన్లు

image

AP: హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు పూర్తిస్థాయి జడ్జిలుగా ప్రమోషన్ దక్కింది. వీరి పదోన్నతి కోసం సుప్రీం కోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

News August 8, 2025

ఎల్లుండి ఒకే స్టేజీపైకి ఎన్టీఆర్, హృతిక్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘వార్ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఎల్లుండి (ఆదివారం) యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5గంటలకు వేడుక ప్రారంభం కానుంది. ఈవెంట్‌కు తారక్‌తో పాటు హృతిక్ హాజరవుతారని సమాచారం. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది.