News January 8, 2025

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.

Similar News

News August 24, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన పుజారా

image

పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతీసారి నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడం మాటల్లో చెప్పలేను. అన్ని మంచి విషయాలు ముగియాల్సిందే. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు!’ అని Xలో రాసుకొచ్చారు. 103 టెస్టుల్లో 7,195, 5 ODIల్లో 51రన్స్ చేశారు. టెస్టుల్లో 206* టాప్ స్కోర్. 2023లో AUSతో చివరి టెస్టు ఆడారు.

News August 24, 2025

వడ మధ్యలో రంధ్రం ఎందుకో తెలుసా?

image

మినప వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేకుండా ఉడికిస్తే బయటి భాగం త్వరగా వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. రంధ్రం పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. వేడి నూనె వడ లోపలి భాగాలను సమానంగా తాకి ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అంతేకాదు రంధ్రం వల్ల వడ తక్కువ మోతాదులో నూనెను వాడుకుంటుంది. ఆకారం మారకుండా ఉంటుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా రంధ్రం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.

News August 24, 2025

GREAT: నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు

image

AP: చదువుతో పేదరికాన్ని జయించొచ్చని నిరూపించారు చిత్తూరు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలను చదివించారు. పెద్ద కూతురు వీణ 2014లో కానిస్టేబుల్ జాబ్ సాధించారు. 2016లో వాణి SGTగా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్ట్ కాగా, తాజాగా డీఎస్సీలో శిరీష SGT పోస్ట్ సాధించారు.