News August 11, 2024
వచ్చే రెండ్రోజుల్లో మార్కెట్లోకి ఐదు ఐపీఓలు

వచ్చే 2 రోజుల్లో ఐదు సంస్థల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. వీటిలో సరస్వతి శారీ డిపో లిమిటెడ్(రేపు), సన్‌లైట్ రీసైక్లింగ్(రేపు), పాజిట్రాన్ ఎనర్జీ(రేపు), సాల్వ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్(ఎల్లుండి), బ్రోచ్ లైఫ్‌కేర్ హాస్పిటల్(ఎల్లుండి) ఉన్నాయి. సరస్వతి శారీ డిపో ఒక్కో షేరుకు రూ.152-160 ధరతో రూ.160 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 24, 2025
చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్‌మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
అమెరికా వీసా రాలేదని..

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. US వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి HYDలో ఆత్మహత్య చేసుకున్నారు. MBBS చేసిన ఆమె USలో PG చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. HYDలోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో ‘శాశ్వతంగా USలోనే ఉండిపోవాలనే ఉద్దేశం’ అని కారణాన్ని చూపుతూ రిజెక్ట్ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి సూసైడ్ చేసుకున్నారు.


