News June 22, 2024
నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఐదుగురు అరెస్ట్

‘NEET UG 2024’ పేపర్ లీక్ కేసులో మరో ఐదుగురిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని AIMS-దేవ్‌ఘర్ సమీపంలోని ఓ ఇంటి నుంచి నిన్న రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరింది. పేపర్ లీకేజీ సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.30లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే.
Similar News
News January 2, 2026
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.
News January 2, 2026
మాటపై ఉంటారా? టికెట్ రేట్స్ పెంచుతారా?

TG: పుష్ప 2 విషాదం తర్వాత సినిమాల టికెట్ రేట్స్ పెంచమని CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పలు మూవీస్ రేట్ పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇటీవల అఖండ-2కు ధరలు పెంచగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తనకు తెలియకుండా అధికారులే ఆదేశాలిచ్చారని, ఇకపై ఇలా జరగదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలోని ‘రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు’లకూ ఇది వర్తిస్తుందా? చూడాలి.
News January 2, 2026
పార్టీయే ప్రాణం.. భర్తకు గుడ్‌బై!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. BJP పట్ల విధేయత కారణంగా మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వివాదానికి దారి తీసింది. దీనిని పార్టీకి వెన్నుపోటుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.


