News November 21, 2024
ఝాన్సీ ఆస్పత్రిలో మరో ఐదుగురు మృతి
యూపీలోని ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో ఈనెల 15న <<14624063>>అగ్నిప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని 10 మంది నవజాత శిశువులు మరణించారు. 39 మంది శిశువుల్ని రక్షించగా, అందులో ఐదుగురు గత రెండు రోజుల్లో అనారోగ్యంతో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే వారి శరీరాలపై ఎటువంటి కాలిన గాయాలు లేవని, వారిపై పొగ ప్రభావం కూడా పడలేదని డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 26, 2024
యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: టీజీపీఎస్సీ
TG: వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. DEC 16న జరిగే RRB పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.
News November 26, 2024
జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు
AP: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.
News November 26, 2024
కులగణన సర్వే 92.6 శాతం పూర్తి
TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్లైన్లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.