News March 28, 2024
సీఎం సహా ఐదుగురు ఏకగ్రీవం!
అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు BJP ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియగా ఆయా స్థానాల్లో BJP నేతలు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వారి ఎన్నికను ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 19న 55 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.
Similar News
News November 5, 2024
జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు: సీఎం
AP: పోలవరం ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రతిరోజూ కీలకమేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 1,396 మీటర్ల పొడవైన నూతన డయాఫ్రం వాల్ పనులు జనవరి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ముఖ్యమని తెలిపారు. 2028 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తిచేసేలా ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు.
News November 5, 2024
కులగణనను 2025 జనగణనలోకి తీసుకోవాలి: రేవంత్
TG: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ నేతలకు మాట ఇస్తే అది శాసనమని అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని చెప్పారు. దీనిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
News November 5, 2024
దీపికా-రణ్‌వీర్ కూతురి పేరుపై భిన్న స్పందన
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్-దీపికా తమ కూతురికి ‘దువా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పలువురు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. దువా అనేది ఇతర మతానికి సంబంధించిన పేరని, హిందూ పేరు పెట్టడానికి మనసు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో పేరు పెట్టడం తల్లిదండ్రుల ఇష్టమని, ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.