News April 29, 2024

ఐదు రాష్ట్రాలు తిరిగి.. చివరికి చిక్కి!

image

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నటుడు సాహిల్ విఫలయత్నం చేశారు. నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాలు తిరిగారు. ఈనెల 24న ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో అరెస్ట్‌ను తప్పించుకునేందుకు సాహిల్ మహారాష్ట్ర నుంచి గోవాకు వెళ్లారు. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్లీకి, అటు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. HYD నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లగా జగదల్‌పుర్‌లో చివరకు దొరికిపోయారు.

Similar News

News November 24, 2025

అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

image

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 24, 2025

అండర్ వరల్డ్‌ మాఫియాకు బెదరని ధర్మేంద్ర

image

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1980, 90ల్లో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులను విపరీతంగా ఎదుర్కొంది. భయంతో కొందరు నటులు సినిమాలను నిలిపివేయగా, మరికొందరు వారికి డబ్బులు ఇచ్చేవారు. అయితే <<18377596>>ధర్మేంద్ర<<>> మాత్రం వారికెప్పుడూ తలొగ్గలేదని డైరెక్టర్ సత్యజీత్ పూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరైనా ఆయనను బెదిరింపులకు గురిచేస్తే పంజాబ్ నుంచి గ్రామస్థులు ట్రక్కుల్లో వస్తారని తిరిగి వార్నింగ్ ఇచ్చేవాడని గుర్తుచేశారు.

News November 24, 2025

నేరుగా రైతుల నుంచే కొనండి.. హోటళ్లకు కేంద్రం సూచన

image

వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రైతుల ఉత్పత్తి సంస్థల (FPO) నుంచే కొనాలని హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. సప్లై చైన్ నుంచి మధ్యవర్తులను నిర్మూలించడం ద్వారా రైతుల రాబడిని పెంచవచ్చని చెప్పింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూచించింది. దేశంలో 35వేల FPOలు ఉన్నాయని, వాటిలో 10వేల వరకు ప్రభుత్వం స్థాపించిందని తెలిపింది.