News December 20, 2024

జేపీసీలో ఐదుగురు తెలుగు ఎంపీలకు చోటు

image

జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. రాజ్యసభ నుంచి 12 మందిని జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఇందులో తెలుగు ఎంపీలు సీఎం.రమేశ్, హరీశ్ బాలయోగి, బాలశౌరి, కె.లక్ష్మణ్, విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. కాగా ఇప్పటికే జమిలి బిల్లు జేపీసీకి పంపడానికి లోక్‌సభలో ఆమోదం లభించింది.

Similar News

News October 22, 2025

పరమ శివుడికి ఇష్టమైన మాసం

image

కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజులు పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఈ మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో తులసి కోట, దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మంచిదని అంటున్నారు. కార్తీక మాస వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అన్నదానం, వస్త్ర దానం, గోదానం చేస్తే పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News October 22, 2025

కార్తీక మాసంలో దీపాల విశిష్ఠత

image

కార్తీక మాసంలో సూర్యుడు తుల-వృశ్చిక రాశుల్లో, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వగా అవుతూ చీకటి దట్టంగా ఉంటుంది. అప్పుడు మన శరీరమూ కాస్త బద్దకిస్తుంది. చీకట్లను పారదోలడంతోపాటు మన శక్తి పుంజుకునేందుకు దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదమంటున్నారు.

News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.