News December 19, 2024
ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 26, 2026
బాలికల కోసం అండగా నిలుస్తున్న ప్రభుత్వ పథకాలు

బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. *బేటీ బచావో – బేటీ పఢావో: లింగ వివక్ష నివారణ, బాలికా విద్య ప్రోత్సాహం. * సుకన్య సమృద్ధి యోజన: చదువు, వివాహ ఖర్చుల కోసం ఆర్థిక భద్రత. * ఉడాన్: ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో బాలికల ప్రవేశం పెంపు. * పోషణ్ అభియాన్: బాలికల్లో పోషకాహార లోపం నివారణ. * కౌమార బాలికల పథకం: 11–14 ఏళ్ల పాఠశాల వెలుపల ఉన్న బాలికలకు పోషక మద్దతు
News January 26, 2026
కలెక్షన్ల సునామీ.. ‘బార్డర్-2’కు రూ.120 కోట్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ‘బార్డర్-2’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న రూ.54 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ సెలవు కావడంతో మరో రూ.50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముందని వెల్లడించాయి. అటు ‘ధురంధర్’ మూడు రోజుల్లో రూ.105 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.
News January 26, 2026
కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీలు.. 11 మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్-TG సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బాంబుల మోత మోగింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వరుసగా పేలాయి. దీంతో 11 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో 10 మంది DRG, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గతేడాది కర్రెగుట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31మంది నక్సల్స్ మరణించారు.


