News July 31, 2024
టీడీపీలోకి ఐదుగురు కుప్పం YCP కౌన్సిలర్లు

AP: సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News November 17, 2025
ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
News November 17, 2025
ఒంటరిని చేసి వేధిస్తారు

మానసికంగా వేధించే వారి శైలి భిన్నంగా ఉంటుంది. కొందరు భాగస్వామిని వారి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి క్రమంగా దూరం చేస్తుంటారు. కొంతకాలానికి వారికి తాను తప్ప ఇంకెవరూ లేరన్నంతగా తమపై ఆధారపడేలా చేసుకుంటారు. ఇలా పూర్తిగా తమ వశమయ్యాక మాటలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతుంటారు. ప్రతిదానికీ తమ అనుమతి తీసుకోవాలంటారు. ఇలాంటి వారి చేతుల్లో చిక్కుకున్న వారి జీవితం నిత్య నరకంలా మారుతుంది.
News November 17, 2025
‘శివ’ అంటే ఏంటో మీకు తెలుసా?

‘శివ’ అంటే మంగళం అని అర్థం. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన సర్వ వ్యాపకుడు. సర్వమునకు మూలకారణమైనవాడు. శివుణ్ణి నిరాకారుడిగా(రూపం లేనివాడిగా), సాకారుడిగా(రూపం ఉన్నవాడిగా) ఆరాధిస్తారు. శివుని సాకార స్వరూపమే లింగము. ఆ శివలింగం మనల్ని సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన వైపునకు నడిపిస్తుంది. భక్తులకు మోక్ష మార్గాన్ని చూపి, ఉన్నత స్థాయికి చేరుస్తుంది.


