News May 3, 2024

వెస్టిండీస్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

image

వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌ను ఐదేళ్ల పాటు క్రికెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. శ్రీలంక, యూఏఈ, వెస్టిండీస్‌లలో జరిగిన పలు లీగ్స్‌లో ఆయన ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు తెలిపింది. తక్షణమే అతడిపై ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా థామస్.. విండీస్ తరఫున 21 వన్డేలు, 12 టీ20లు ఆడారు. చివరిసారిగా ఆయన 2022 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై తన మొదటి, చివరి టెస్టు ఆడారు.

Similar News

News March 28, 2026

4 లీటర్ల పెట్రోల్ దాచాడని 3 వారాలు జైలు శిక్ష

image

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన కొరతతో దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 లీటర్ల పెట్రోల్ దాచాడనే కారణంతో శ్రీలంక కోర్టు బాలసూర్య అనే వ్యక్తికి 3 వారాల జైలు శిక్ష, రూ.1,500 ఫైన్ విధించింది. అతను అక్రమంగా పెట్రోల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే తాను ఇంటి పరిసరాల్లో చెత్తను కాల్చేందుకు తెచ్చుకున్నానని నిందితుడు తెలిపారు.

News March 28, 2026

నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

image

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 గం. వరకు ఒక గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.

News March 28, 2026

భారత్ నుంచి శ్రీలంక, బంగ్లాకు 53వేల టన్నుల పెట్రోల్, డీజిల్

image

ఇంధన సంక్షోభం వేళ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు 20వేల టన్నుల డీజిల్, 18 వేల టన్నుల పెట్రోల్ పంపింది. బంగ్లాకు 5వేల టన్నుల డీజిల్ పంపించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి 15వేల టన్నుల డీజిల్ వచ్చినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. వచ్చే నెలలో 45వేల టన్నుల డీజిల్ రానుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశాలకు పంపడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.