News August 5, 2024
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సైనికులను తరలించే కాన్వాయ్‌ల రాకపోకలనూ నిలిపేసింది. కాగా ఆర్టికల్ 370ని కేంద్రం 2019 AUG 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. సుప్రీంకోర్టు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
Similar News
News January 9, 2026
9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.
News January 9, 2026
‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.
News January 9, 2026
బ్లోఅవుట్ వద్ద సీఎం ఏరియల్ వ్యూ

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. సిబ్బంది చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై సీఎం ఆరా తీశారు. ఇటీవల గ్యాస్ బ్లోఅవుట్ జరిగి మంటలు చెలరేగగా ఇంకా అదుపులోకి రాలేదు. పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


