News April 16, 2024
భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఫిక్స్

భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.
Similar News
News April 6, 2026
గుడ్‌న్యూస్.. రాష్ట్రం నుంచి మరో 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు

AP: దక్షిణాదిన కేంద్రం నిర్మించే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. అమరావతి నుంచి గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీ సిటీ మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరు-చెన్నై కారిడార్ ఏర్పాటు కానున్నాయి. తొలుత హైదరాబాద్-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది.
News April 6, 2026
కాసేపట్లో భారీ వర్షం: APSDMA

AP: రాగల 3 గంటల్లో తూ.గో., ప.గో., ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 40-60KM వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరి, ఏలూరు, ప.గో., తదితర జిల్లాల్లో వానలు పడుతున్నాయి.
News April 6, 2026
కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్.. మంత్రి వార్నింగ్

TG: డ్రగ్స్ నిర్మూలనకు EAGLE వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా, ఫుడ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సంకల్పించారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో 11వేలకు పైగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


