News May 13, 2024
ట్రెండింగ్‌లో ‘ఫిక్సింగ్’

నిన్న తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో సీఎస్కే, RCB విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులు ‘ఫిక్సింగ్’ అని నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఫిక్సింగ్ చేసిందని CSK ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అందుకే DC ప్లేయర్లు క్యాచులు వదిలేశారని అంటున్నారు. మరోవైపు సీఎస్కేతో మ్యాచులో రాజస్థాన్ స్లోగా ఆడి ఫిక్సింగ్ చేసిందని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్?
Similar News
News February 7, 2026
ఏపీలో చిక్కింది.. తెలంగాణలో సెర్చింగ్!

తెలుగు రాష్ట్రాలను కొన్ని రోజులుగా పెద్దపులులు భయపెడుతున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనాలను భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి నిన్న అధికారులకు చిక్కింది. మరోవైపు తెలంగాణ జనగాంలోని రఘునాథపల్లిలో మరో పెద్దపులి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా లేగదూడను చంపిన ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 7, 2026
ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల గూడ్స్.. US నుంచి ఇండియాకు!

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఏకంగా 500 బిలియన్ డాలర్ల గూడ్స్‌ను ఇండియా కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధన ఉత్పత్తులు, ఎయిర్‌క్రాఫ్టులు, వాటి పార్టులు, విలువైన లోహాలు, టెక్నాలజీ ప్రొడక్టులు, కోకింగ్ కోల్ వంటివి ఉన్నాయి. డేటా సెంటర్లలో ఉపయోగించే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU)తో పాటు ఇతర టెక్నాలజీ ప్రొడక్టుల వాణిజ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
News February 7, 2026
IND-US మధ్య కుదిరిన ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్

IND-US మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైనట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని ఫ్రేమ్ వర్క్‌లో పేర్కొంది. US నుంచి ఇంధనం, గ్యాస్‌ను భారత్ దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పింది. అమెరికా దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలను IND సున్నాశాతానికి తగ్గిస్తుందని తెలిపింది.


