News August 31, 2024

FLASH: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు PINK ALERT⚠️

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News December 13, 2025

NZB: మద్యం దుకాణాలు బంద్

image

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయనున్నామని NZB జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు నిజామాబాద్ రూరల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నట్లు తెలిపారు.

News December 13, 2025

NZB: రెండవ విడత GP ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పోలింగ్ సమయం: ఉదయం7గంటల నుంచి 1 గంట వరకు
*మొత్తం సర్పంచ్ స్థానాలు: 196
*ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు: 38
*ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు:158
*పోటీలో ఉన్న అభ్యర్ధులు: 568
*మొత్తం వార్డు స్థానాలు: 1760
*ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు: 674
*ఎన్నికలు జరుగనున్న వార్డులు:1081
*పోటీలో ఉన్న అభ్యర్ధులు : 2634
*ఓటర్ల సంఖ్య: 2,38,838
*పోలింగ్ కేంద్రాలు : 1476

News December 13, 2025

NZB: 2వ విడత.. 38 మంది సర్పంచ్ లు ఏకగ్రీవం

image

ఆదివారం జరగబోయే 2వ విడత GPఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 568 మంది బరిలో నిలిచారన్నారు.