News May 22, 2024

FLASH: ఓయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్

image

HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్‌ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News July 10, 2025

GHMCలో మీడియాపై ఆంక్షలు?

image

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News July 10, 2025

నిజాంపేట్‌లో మరో కల్తీ కల్లు కేసు.. గాంధీకి తరలింపు

image

కల్తీ కల్లు తాగి నిజాంపేట్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News July 10, 2025

HYD: కల్లీ కల్లు ఘటనలో మృతుల వివరాలు.!

image

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలో భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్, ఇంద్రహిల్స్‌లోని కల్లు కాంపౌండ్, హైదర్‌నగర్‌లో మరొక్క కల్లు కాంపౌండ్‌లో ఆదివారం తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిలో HMT హిల్స్‌కి చెందిన ఇద్దరు, హైదర్‌నగర్, శ్రీరామ్‌నగర్, మహంకాళి నగర్, సాయి చరణ్ కాలనీకి చెందిన వారు మృత్యువాత పడ్డారు. 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.