News July 15, 2024

FLASH: కర్నూలు ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు

image

కర్నూలు నూతన ఎస్పీగా జీ.బిందు మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన ఏఆర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2024

రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్

image

నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.

News October 5, 2024

కర్నూలు: నీటి కుంటలో పడి ఇద్దరు పిల్లల మృతి

image

నందవరం మండలం మాచాపురంలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు బైరి ఉదయ్ కుమార్(6), అనుమేశ్ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లల మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు

image

ఈనెల 6 నుంచి 13 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వీరేశ్ ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి షేక్షావల్లి తెలిపారు. శనివారం కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో వీరేశ్‌ను సత్కరించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కోచ్ యుసుఫ్ బాషా పాల్గొన్నారు.