News March 14, 2025
FLASH: కామారెడ్డి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

కామరెడ్డి జిల్లాలోని హైవేపై టేక్రియాల్ గేట్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందాడని చెప్పారు. ఆటో వెనుక నుంచి వస్తున్న లారీ నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 18, 2025
కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 18, 2025
ప.గో: ACB DSPగా కృష్ణారావు ఛార్జ్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ DSPగా జి.వి కృష్ణారావు ఏలూరు ACB కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అవినీతి సమాచారంపై ప్రజలు నిర్భయంగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని లేదా వారి మొబైల్ నెంబర్ 9440441657కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా, సమాచారం అందించినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు.
News December 18, 2025
కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి భారీ ఆదాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల సందర్భంగా హుండీలను 17, 18 డిసెంబర్ 2025 తేదీల్లో తెరచి లెక్కించారు. రెండు రోజుల్లో మొత్తం నగదు రూ.4,49,13,187, బంగారం 218 గ్రాములు, వెండి 17 కిలోలు 324 గ్రాములు లభించాయి. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఖతార్ సహా పలు దేశాల విదేశీ కరెన్సీ సమర్పణలు వచ్చినట్లు దేవస్థానం ఈవో శీనానాయక్ తెలిపారు.


