News February 1, 2025
FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై వివరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
News February 9, 2025
జడ్చర్ల: రేపటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొననున్న ఎస్పీ

జడ్చర్ల సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి .జానకి పాల్గొననున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తారని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తెలపాలని కోరారు.
News February 8, 2025
షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.