News February 1, 2025
FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

వికారాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పనులపై బయటకు వెళ్లేవారు, కూలీలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా బయటికి రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 3 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.