News February 25, 2025
FLASH: నర్సంపేట: చింత చెట్టు కూలి ఒకరి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మాదన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుంచు రవిపై మంగళవారం చింత చెట్టు కూలింది. తీవ్ర గాయాల పాలైన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో బ్యాలెట్ పేపర్ల పరిశీలన, పోలింగ్ సామగ్రి కేంద్రాల వారీగా వేరుచేసి పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది తుది రాండమైజేషన్ కలెక్టర్ నిర్వహించి 13 కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ కేంద్రాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
News February 26, 2025
వరంగల్: ఇంట్లో పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

వరంగల్ కొత్తవాడలో తాళం వేసిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలడంతో అక్కడే నివసిస్తున్న ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తాళం వేసిన ఇంట్లో అనుమానాస్పద పదార్థాలు పేలినట్లు చర్చించుకుంటున్నారు. ఆందోళనకు గురైన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక మట్టేవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News February 26, 2025
వరంగల్: నలుగురి ARREST

వరంగల్ కాశిబుగ్గలోని శాంతినగర్ చెరువు కట్టమీద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతుండగా పెట్రోలియం చేస్తూ వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25,000 విలువ చేసే కేజీ గంజాయి, నాలుగు సెల్ ఫోన్స్, రూ.17,500 నగదును స్వాధీనపరచుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు.