News March 21, 2024
FLASH.. నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.
Similar News
News September 14, 2024
రిజర్వాయర్ గేట్ల వద్ద చేపలు పడుతూ యువకుల కాలక్షేపం
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద ఇటీవల భారీ వర్షాలతో అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. దీంతో వరదనీటితో పాటు చేపలు దిగువ ప్రాంతానికి వచ్చాయి. ఈ క్రమంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దఎత్తున అలీసాగర్ గేట్ల దిగువన నిలిచిన వరదనీటితో చేపలు పట్టేందుకు ఇలా చుట్టూ ఉన్న గోడపై కూర్చొని కాలక్షేపం చేశారు.
News September 13, 2024
పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్
తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News September 13, 2024
NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO
నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.