News January 30, 2025
FLASH: రాచమల్లు తల్లి మృతి

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రాచమల్లు ముని రత్నమ్మ(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లో పెద్ద కుమారుడు కిరణ్ రెడ్డి ఇంట్లో ఉండగా గురువారం ఉదయం ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు ఆమె భౌతికకాయాన్ని తీసుకురానున్నారు.
Similar News
News February 9, 2026
ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
News February 9, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,650
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.1,476
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,730.
News February 9, 2026
ప్రొద్దుటూరు అభివృద్ధిపై రేపు జిల్లా కలెక్టర్ సమీక్ష

ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధిపై మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన సమీక్ష ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచన మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. నియోజకవర్గంలోని సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని డీఆర్ఓ ఆదేశించారు.


