News January 29, 2025

FLASH: వరంగల్: బావిలో దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు

image

భూ తగాదాలతో బావిలోకి దూకిన గిరిజన మహిళను పోలీసులు ప్రాణాలతో రక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అజ్మీరా మంగ అనే మహిళ బుధవారం వ్యవసాయ బావిలో దూకింది. స్థానికుల సమాచారం మేరకు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కలిసి ఆ మహిళను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా కుటుంబాల మధ్య జరుగుతున్న భూ తగాదాలతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు.

Similar News

News November 7, 2025

భద్రాద్రి కలెక్టరేట్‌లో జాతీయ గీతాలాపన

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన పాల్గొని వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు.

News November 7, 2025

వందేమాతరం దేశస్ఫూర్తికి ప్రతీక: SP

image

వందేమాతరం గేయం 150 ఏళ్ల వేడుకలను తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. దేశభక్తితో నిండిన ఈ వేడుకలో ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం మన దేశస్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతి భారతీయుడు ఈ గేయాన్ని తమ హృదయంలో నిలుపుకోవాలని ఆయన కోరారు.

News November 7, 2025

ప్రకాశం జిల్లాలో 16పోస్టులు.. అప్లై చేశారా?

image

ఏపీలోని ప్రకాశం జిల్లాలో శిశుగృహ, బాల సదనంలో 16 ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB,పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ, బీఈడీ, బీఏ బీఈడీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.