News September 3, 2024
FLASH: వరద బాధితులకు మంత్రి భరత్ రూ.10 లక్షల సాయం
రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి, కర్నూలు నియోజకవర్గ MLA టీజీ భరత్ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. TGV గ్రూప్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.
Similar News
News September 19, 2024
కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా జయలక్ష్మి
కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.
News September 18, 2024
ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
News September 18, 2024
నంద్యాల: కాలువలో పడి బాలుడి మృతి
శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.