News April 10, 2025
FLASH..శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
Similar News
News April 20, 2025
HYD: క్రికెట్ బెట్టింగ్ భూతానికి యువకుడి బలి

క్రికెట్ బెట్టింగ్ కారణంగా మియాపూర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మియాపూర్ PS పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేశ్(26) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకొవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
News April 19, 2025
OU: 24 నుంచి బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 19, 2025
జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.