News May 20, 2024

FLASH.. షాద్‌నగర్: గేటు దిమ్మె కూలి బాలిక మృతి

image

షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మల్లేష్, రమాదేవి దంపతుల కూతురు సాక్షిని ప్రమాదవశాత్తు మృతి చెందింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ సమయంలో ఇంటి ముందున్న ప్రహరీ గోడకు ఉన్న గేటు దిమ్మెను పట్టుకోగా అది బాలిక తలపై పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. అప్పటివరకు ఆడుతున్న చిన్నారి ఒక్కసారిగా కళ్లముందే విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News December 7, 2024

MBNR: గ్రూప్ -4 సాధించిన కానిస్టేబుళ్లు.. అభినందించిన జిల్లా ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.

News December 7, 2024

MBNR: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్

image

ఆందోల్ MLA రాజనర్సింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆయనకు CM రేవంత్ వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించడంతో పాటు MBNR ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MBNR‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రుణమాఫీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తున్నామన్నారు. మీ కామెంట్?

News December 7, 2024

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. పాలమూరు REPORT

image

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి MBNRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, కొడంగల్‌‌లో ‘కడా’ ఏర్పాటు, కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి రూ.110కోట్లతో శంకుస్థాపన, జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటన, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?