News August 31, 2024

FLASH: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు RED ALERT⚠️

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News March 9, 2026

ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

image

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.

News March 9, 2026

ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

image

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.