News August 31, 2024
FLASH: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు PINK ALERT⚠️

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News March 9, 2026
NZB: ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
News March 9, 2026
NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌ఓ

నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.
News March 8, 2026
NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.


