News May 20, 2024

FLASH: ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌

image

ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్‌లు ఇద్దరు ACBకి పట్టుబడ్డ ఘటన శంషాబాద్ మం. నానాజీపూర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. HYDకు చెందిన బర్కత్ అలికి ఉన్న 500 గజాల స్థలంలో కాంపౌండ్ వాల్‌తో పాటు, చిన్న రూమ్ వేసుకోవడానికి గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికను సంప్రదించగా.. రూ.65 వేలు లంచం అడిగింది. చివరిగా రూ.30 వేలు ఇవ్వాలంది. నగదు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు.

Similar News

News October 3, 2024

HYD: తోపుడు బండి, ఫుడ్ కోర్టు పెట్టారా..?మీకోసమే

image

✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.

News October 3, 2024

HYD: KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP

image

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.

News October 3, 2024

HYD: IT వైపే అందరి మొగ్గు.. కోర్ బ్రాంచీల కష్టాలు..!

image

యువత IT వైపే మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచీలకు కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అభ్యసించిన వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని HYDలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో IT, CSE బ్రాంచుల్లో 99% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.అదే కోర్ బ్రాంచీల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.