News March 14, 2025
FLASH: కామారెడ్డి: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

కామరెడ్డి జిల్లాలోని హైవేపై టేక్రియాల్ గేట్ వద్ద ఆటోను లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందాడని చెప్పారు. ఆటో వెనుక నుంచి వస్తున్న లారీ నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

నగరంలో గల జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. సిబ్బంది వెంటనే స్పందించి నగర పోలీస్ కమిషనర్‌కు సమాచారం అందించారు. వెంటనే డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు కోర్టు ఆవరణం మొత్తం జల్లెడ పట్టారు. ఎక్కడా ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు.
News February 25, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి’

డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.
News February 25, 2026
నిత్యమల్లి సాగుతో ఏడాదికి రూ.1.2కోట్లు!

సంప్రదాయ పంటలతో నష్టాలు చూస్తున్న ఒడిశాలోని గంజాం జిల్లా రలబ గ్రామ రైతులు పూల సాగుతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి రజనీగంధ (నిత్యమల్లి) సాగుతో ఏడాదికి ₹1.2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. పూలను భువనేశ్వర్, కోల్‌కతా వంటి నగరాల మార్కెట్లకు తరలించి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పంట కష్టాల్లో ఉన్న రైతులకు కొత్త ఆశను చూపుతూ స్మార్ట్ అగ్రికల్చర్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.


