News November 8, 2024

FLASH: కామారెడ్డి: విషాదం.. బైక్ టైరు పేలి చనిపోయాడు..! 

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు సీలింగ్‌కు వేగంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

Similar News

News December 14, 2025

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

image

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

News December 14, 2025

NZB: 11 గంటల వరకు 49.13 శాతం పోలింగ్

image

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లో ఉదయం 11 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 49.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ధర్పల్లి మండలంలో 53.59%,
* డిచ్‌నపల్లి-35.36%
* ఇందల్వాయి-50.45%
* జక్రాన్‌పల్లి-55.16%
* మాక్లూర్-56.25%
* మోపాల్- 55.17%
* NZB రూరల్-60.28%
* సిరికొండ-38.49% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News December 14, 2025

నిజామాబాద్ జిల్లాలో 20.49 శాతం పోలింగ్

image

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన రెండు గంటల్లో ఉదయం 9 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1081WM లకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
*ధర్పల్లి మండలంలో 20.99%,
*డిచ్పల్లి -13.52%
*ఇందల్ వాయి- 19.95%
*జక్రాన్ పల్లి- 23%
*మాక్లూర్-22.31%
*మోపాల్- 19.43%
*NZB రూరల్- 26.69%
*సిరికొండ-23.24% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.