News February 1, 2025
FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
పెరటి కోళ్లు-నాటు కోళ్ల పెంపకం.. ఏది బెస్ట్?

వనశ్రీ, రాజశ్రీ కోళ్లు 6 నెలల్లో 2.5- 3 KGల బరువు పెరుగుతాయి. నాటుకోళ్లు ఇదే సమయంలో 1.5 KGల బరువే పెరుగుతాయి. పెరటి కోళ్లు 150 నుంచి 160 రోజుల్లో తొలిసారి గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు 200 రోజుల తర్వాతే గుడ్లు పెడతాయి. పెరటి కోళ్లు ఏడాదికి 150-180 గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు ఏడాదికి 50- 60 గుడ్లే పెడతాయి. అందుకే పెరటికోళ్ల ఆరోగ్యం, మేతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు నిపుణులు.
News November 5, 2025
రాయపర్తి: జోనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు ముస్తాబు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల రాయపర్తిలో నిర్వహించనున్న జోనల్ లెవెల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు క్రీడా మైదానాలు ముస్తాబవుతున్నాయి. ప్రిన్సిపల్ సముద్రాల సరిత ఆధ్వర్యంలో పీడీలు, పీఈటీలు టోర్నమెంట్‌కు అనుగుణంగా మైదానాలను సంసిద్ధం చేస్తున్నారు. ఈ నెల 6-8 వరకు జరిగే ఈ పోటీల్లో 1,190 మంది క్రీడా విద్యార్థినులు పాల్గొంటారు.
News November 5, 2025
NLG: రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

మహాత్మాజ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకులంలో ఈనెల 6వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల బాలురకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, తదితర అన్ని రకాల ఆటలు ఉంటాయి. గేమ్స్‌కు సంబంధించి స్పోర్ట్స్ మీట్, సెలక్షన్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ తెలిపారు.


