News February 17, 2026
FLASH.. తొర్రూరులో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం?

తొర్రూరు మున్సిపాలిటీ బాధ్యతలను ఎంపీ రఘురామరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజుకు TPCC అప్పగించారు. అయితే, ఇప్పటికే BRSకు 9 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియోతో కలిపి కాంగ్రెస్‌కు 9 మంది అయ్యారు. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో తొర్రూరులో BNS-163 సెక్షన్ అమలు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలసులు మోహరించారు.
Similar News
News February 17, 2026
నీరు ఎక్కువగా తాగితే..

కిడ్నీ హెల్త్ నీరు తాగే విధానంపై ఆధారపడి ఉంటుంది. దాహంగా ఉన్నప్పుడే నీరు తాగడం లేదా అతిగా నీరు తాగడం.. రెండూ సరికాదు. తక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్లు మొదలైనవి వస్తాయి. అతిగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. సోడియమ్, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ తగ్గడమే కాక గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మహిళలు రోజుకు 2.2 లీటర్లు, పురుషులు 3 లీటర్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 17, 2026
బాపట్ల: షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా జట్లు విజయం

సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పీఎంశ్రీ ఎంపీఎల్ గర్ల్స్ హైస్కూల్‌లో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి అండర్-17 షూటింగ్ బాల్ పోటీల్లో బాపట్ల జిల్లా జట్లు రాణించాయి. బాలురు ప్రకాశం జిల్లాపై 2-0తో గెలిచి మూడో స్థానం, బాలికలు అనంతపురం జిల్లాపై 2-0తో విజయం సాధించి రెండో స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు మార్టూరులో క్రీడాకారులను మంగళవారం అభినందించారు.
News February 17, 2026
గంభీర్‌కు RR బంపరాఫర్: కోచ్ పదవికి గుడ్ బై?

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్‌కు రాజస్థాన్ రాయల్స్ (RR) అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మెంటార్‌తో పాటు ఫ్రాంచైజీలో CEO, పార్ట్‌నర్‌గా చేరాలని కోరినట్లు ‘దైనిక్ జాగరణ్’ పేర్కొంది. కొత్త ఓనర్లు గంభీర్‌కు 2-3% వాటా ఆఫర్ చేశారట. దీంతో టీమ్ నిర్ణయాల్లో ఆయనకు పూర్తి అధికారం దక్కుతుంది. గౌతీకి 2027 WC వరకు టీమ్‌ఇండియా కోచ్‌గా కొనసాగేందుకు కాంట్రాక్ట్ ఉంది. RR ఆఫర్‌తో ఆ బాధ్యతల నుంచి తప్పుకొంటారా చూడాలి!


