News December 22, 2025

FLASH.. నకిరేకల్‌లో మర్డర్

image

నకిరేకల్‌లో తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. తిప్పర్తి రోడ్డులో నివాసముండే ఎలగందుల వెంకన్న అనే కోడిగుడ్ల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News December 22, 2025

తిరుమల దర్శనాలపై TTD కీలక ప్రకటన

image

తిరుమల వైకుంఠద్వార దర్శనాలకు డిసెంబర్ 30, 31, జనవరి 1న ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వాళ్లనే అనుమతిస్తారు. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ATGH నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తామని TTD తెలిపింది. టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవు. టోకెన్, ఆధార్ కార్డులతో స్లాట్ సమయానికి భక్తులు రావాలని పోలీసులు కోరారు.

News December 22, 2025

కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

image

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 22, 2025

MDK: పెన్షన్ల పెంపుకు ఎదురుచూపులు ఎన్నాళ్లో!

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపుపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.