News November 4, 2025

FLASH: నిర్మల్: యాక్సిడెంట్‌లో డ్రైవర్ మృతి

image

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామ 61 <<18197838>>జాతీయ రహదారిపై మంగళవారం <<>>మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మామడ మండలం కోరటికల్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News November 5, 2025

నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

image

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్‌కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.

News November 5, 2025

న్యూస్ రౌండప్

image

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు‌లకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు

News November 5, 2025

అధికారులతో నిర్మల్ కలెక్టర్ సమీక్ష

image

వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో చేపట్టిన పనులపై ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.