News February 6, 2026
FLASH: పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,360 పెరిగి రూ.1,53,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 ఎగబాకి రూ.1,40,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
Similar News
News February 6, 2026
తెలంగాణలో పవన్ ప్రచారం రద్దు

TG: రాష్ట్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దైంది. అనివార్య కారణాలతో ప్రచారం రద్దు చేసుకున్నట్టు జనసేన ప్రకటించింది. రేపు, ఎల్లుండి జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2026
260 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News February 6, 2026
కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటే: పవన్ కళ్యాణ్

AP: ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉండాలని, హిందూ దేవుళ్లను అవమానిస్తే మౌనం వీడాలని డిప్యూటీ CM పవన్ పిలుపునిచ్చారు. కులం, ప్రాంతం, భాష వేరైనా ధర్మం ఒక్కటేనన్నారు. ‘ఎవరి కర్మకు వారిని వదిలేసే పద్ధతి మారాలి. మన ధర్మాన్ని అవమానిస్తే పోరాడాల్సింది మనమే. భక్తులుగానే కాదు.. ధర్మ రక్షకులుగా మారాలి. హిందూ ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. మన విశ్వాసాలను కాపాడుకోవడమే’ అని SMలో పేర్కొన్నారు.


