News January 12, 2026
FLASH: బోరబండలో యువతి మర్డర్

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.
Similar News
News February 3, 2026
HYD: ఇంటర్ గురుకుల విద్యార్థులకు ఇబ్బందులు!

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను దూర ప్రాంతాల్లో కేటాయించడంపై గురుకుల కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని TG గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ల్యాబ్ వసతులు, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో సెంటర్లు కేటాయించారని తెలిపింది. కనీసం థియరీ సెంటర్లనైనా సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు డా.అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
News February 3, 2026
HYD: ఫోన్ నంబరుకు ప్రాపర్టీ ట్యాక్స్ లింక్

ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ వివరాలను ఓనర్ మొబైల్ నంబరుకు కచ్చితంగా లింక్ చేయాలని నిర్ణయించింది. ఇది వరకు ఈ పద్ధతి కొనసాగినా మహానగరంలో 30% మంది ఓనర్ల మొబైల్ నంబరు లింక్ కాలేదు. దీంతో లింక్ తప్పనిసరిగా చేయాలని రెవెన్యూ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అధికారులతో పేర్కొన్నారు. ఈ పద్ధతి ఇటీవల విలీన ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు సమాచారం.
News February 3, 2026
HYD: ‘ప్రైవేట్’ ప్లాన్.. లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేస్తారు

నగరంలో కొన్ని ప్రైవేటు్ ఆస్పత్రులు రోగుల ప్రాణాలతో ఆడుకుంటూ కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఇన్ పేషెంట్లకు చికిత్స చేశాక పరిస్థితి చేయి దాటిపోతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. రూ.లక్షలు లాగేసిన తర్వాత.. ‘రోగి పరిస్థితి బాగాలేదు.. సర్కారు ఆస్పత్రికి వెళ్లండి’ అని చెబుతున్నారు. రోగుల మరణాలు తమ ఆస్పత్రి రికార్డులో ఉండొద్దనే ఈ ప్లాన్ వేస్తున్నారు.


