News March 24, 2026

FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

image

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.

Similar News

News April 5, 2026

‘PSL నం.1 అవుతుంది’.. PCB ఛైర్మన్ డబ్బా!

image

కేవలం 2 వేదికల్లో, <<19452212>>ఖాళీ స్టేడియాల్లో<<>> నిర్వహిస్తున్న PSLపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా PSL మారిందని బోర్డు మీటింగ్‌లో గొప్పలకు పోయారు. ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అవుతుందని అన్నారు. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోందని, గ్లోబల్ స్టేజ్‌పై పాక్ క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.

News April 5, 2026

నీటి సంరక్షణ.. రేపటి నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్

image

AP: నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 100 రోజుల(ఏప్రిల్ 6-జులై 14) కార్యాచరణను ప్రకటించారు. రేపు అనంతపురం(D) యాడికిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘చెరువులు, కాల్వలను క్లియర్ చేయాలి. నీటిని నిల్వ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 8.7 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని CM అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 5, 2026

థార్ ఎడారిలో రికార్డు స్థాయి క్రూడాయిల్ ఉత్పత్తి

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో క్రూడాయిల్ వెలికితీతను భారీగా పెంచింది. బాఘేవాలా ఫీల్డ్ నుంచి రోజుకు 1,202 బ్యారెళ్ల రికార్డు ఉత్పత్తిని సాధించింది. గతేడాది(రోజుకు 705 బ్యారెళ్ల)తో పోలిస్తే 70% అధికం. ఈ ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని రిఫైనరీలకు తరలిస్తారు. బాఘేవాలాలో 200 చ.కి.మీ విస్తీర్ణంలో చమురు నిల్వలు విస్తరించి ఉన్నాయి. FY26లో 43,773 మె.టన్నులను ఉత్పత్తి చేశారు.