News December 16, 2025

FLASH.. ములుగు: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

image

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్‌ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతోపాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.

Similar News

News December 17, 2025

నెల్లూరు: ప్రాణాలు పోతున్నా.. చలించరా..?

image

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.

News December 17, 2025

పెద్దకొడప్గల్: ఓటు వేయడానికి వస్తూ అనంతలోకాలకు..

image

ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామానికి వస్తున్న బిచ్కుంద (M) పుల్కల్ వాసి బక్కోల సాగర్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాగర్ మంగళవారం HYD నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పుల్కల్ బయలుదేరాడు. అయితే, బుధవారం పెద్ద కొడప్గల్ PS పరిధిలోని హైవేపై శవమై కనిపించాడు. మరొకరు తీవ్రగాయాలై కనిపించగా అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News December 17, 2025

సంక్రాంతికి మరో 16 స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతి పండగకు ఊరెళ్లే వారి కోసం దక్షిణమధ్య రైల్వే సర్వీసులు పెంచుతోంది. తాజాగా మరో 16 ట్రైన్స్ అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు ద.మ. రైల్వే తెలిపింది. రైళ్ల పూర్తి సమాచారం కోసం ఇమేజ్ స్లైడ్ చేయండి.