News January 29, 2025
FLASH: వరంగల్: బావిలో దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు

భూ తగాదాలతో బావిలోకి దూకిన గిరిజన మహిళను పోలీసులు ప్రాణాలతో రక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అజ్మీరా మంగ అనే మహిళ బుధవారం వ్యవసాయ బావిలో దూకింది. స్థానికుల సమాచారం మేరకు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కలిసి ఆ మహిళను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా కుటుంబాల మధ్య జరుగుతున్న భూ తగాదాలతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు.
Similar News
News September 15, 2025
జగిత్యాల : దుర్గ శరన్నవ రాత్రోత్సవాలకు ఆహ్వానం

జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించనున్న శ్రీ గాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 15, 2025
నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.
News September 15, 2025
రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.